ASR: మొంథా తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు కొయ్యూరు మండలం నెల్లిపూడి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో వాగుపై వంతెన పూర్తిగా ధ్వంసమైందని గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. నిత్యం రాకపోకలు సాగించే వంతెన ధ్వంసం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు.