ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగా జలాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. బంగారు, వెండి నగలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు ఆలయ ఆవరణంలో దీపారాధన చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు.