CTR: కుప్పం రైల్వే స్టేషన్కు విచ్చేసిన సౌత్ వెస్ట్రన్ రైల్వే డీఆర్ఎంను స్థానికులు కలిసి వినతిపత్రం అందజేశారు. 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు బెంగళూరు వైపు వెళ్లే రైళ్లు కుప్పంలో నిలపకపోవడంతో ప్రయాణికులకు కలిగే అసౌకర్యాలను డీఆర్ఎంకు వివరించారు. ప్రత్యామ్నాయంగా మల్లానూరు, గుడిపల్లి స్టేషన్లలో రైళ్లను ఆపాలని కోరారు.