KDP: చక్రాయపేట మండలంలోని చెరువు కాంపల్లె వద్ద బొలెరో క్యాంపర్ బోల్తా పడటంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు వంతెన పనుల కోసం ఇక్కడికి వచ్చిన అజయ్, నీళ్ల కోసం క్యాంపర్లో వెళుతుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. కాగా, తీవ్ర గాయాలైన అజయ్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు పోలీసులు తెలిపారు.