కృష్ణా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ రామానగరంలో ఇటీవల రెండు వేర్వేరు అగ్నిప్రమాదాల్లో అనురాధ, వీరాంజనేయులు కుటుంబాలు నివసించే పూరిళ్లు కాలిపోయాయి. ఆదివారం పురిటిగడ్డలోని ఐవీఎం హోంలో ప్రెసిడెంట్ డాక్టర్ వేములపల్లి సురేష్ – రోజా దంపతులు రెండు కుటుంబాలకు రూ.20వేలు చొప్పున ఆర్థిక సహాయం, రూ.10వేలు విలువైన నూతన వస్త్రాలు, సరుకులు అందచేశారు.