తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు దూరంగా ఉన్నారు. దాంతో ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. తాజాగా అవినాశ్ రెడ్డి ఆ నోటీసులకు బదులిస్తూ సీబీఐకు లేఖ రాశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(ys viveka murder case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(MP YS Avinash Reddy)ని సీబీఐ(CBI) విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 16, 19వ తేదీల్లో అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించాల్సి ఉంది. అయితే ఆ విచారణకు అవినాశ్ రెడ్డి గైర్హాజరయ్యారు.
ఇటీవల తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ అవినాశ్ రెడ్డి(MP YS Avinash Reddy) సీబీఐ(CBI) విచారణకు దూరంగా ఉన్నారు. దాంతో ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. తాజాగా అవినాశ్ రెడ్డి ఆ నోటీసులకు బదులిస్తూ సీబీఐకు లేఖ రాశారు. తన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె డిశ్చార్జి అయ్యాకే విచారణకు వస్తానని సీబీఐకి లేఖ ద్వారా తెలిపారు. రేపటి విచారణకు తాను హాజరు కాలేనని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సీబీఐ(CBI) తన తదుపరి నిర్ణయం ఏం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.