»Arguments On Chandrababus Custody Petition Are Over Judgment Will Be Tomorrow Morning
Chandrababu: చంద్రబాబు కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తి.. రేపు ఉదయమే తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబు కేసుపై రేపు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పనుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా ఈ కేసుపై కోర్టులో వాదనలు బలంగా సాగాయి. ఇరువురి వాదనలు విన్న కోర్టు రేపటికి తీర్పును వాయిదా వేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్పై బుధవారం వాదనలు వాడివేడిగా సాగాయి. సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. అలాగే చంద్రబాబు తరపున ఢిల్లీ లాయర్ సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 11.30 గంటలకు ఈ కేసుపై తీర్పు వెలువడనుంది.
చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేశామని సీఐడీ వాదనలు వినిపించింది. ఆయనను విచారించడం కోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా కోరింది. అయితే ఆయనను సిట్ కార్యాలయంలోనే విచారించారని, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, కాబట్టి కస్టడీ పిటిషన్ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా కోర్టులో బలంగా వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు రేపు తీర్పు చెప్పనుంది.