police remove banners:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రపై పోలీసులు (police) ఉక్కుపాదం మోపుతున్నారు. లోకేశ్ (police) అనుచరులను కూడా వదలడం లేదు. సత్యవేడు (satyavedu) నియోజకవర్గంలో పోలీసులు అతి చేశారు. లోకేశ్ (lokesh) వెళుతున్న దారిలో పార్టీ శ్రేణులు కట్టిన జెండాలు, బ్యానర్లను (banners) తొలగించారు. వాటిని పోలీసు వాహనాల్లో (police) తరలిస్తున్నారు.
police remove banners:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రపై పోలీసులు (police) ఉక్కుపాదం మోపుతున్నారు. లోకేశ్ (police) అనుచరులను కూడా వదలడం లేదు. సత్యవేడు (satyavedu) నియోజకవర్గంలో పోలీసులు అతి చేశారు. లోకేశ్ (lokesh) వెళుతున్న దారిలో పార్టీ శ్రేణులు కట్టిన జెండాలు, బ్యానర్లను (banners) తొలగించారు. వాటిని పోలీసు వాహనాల్లో (police) తరలిస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన టీడీపీ శ్రేణులు.. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జెండాలను ఎందుకు తీసివేశారని అడిగారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వెళుతున్నామని చెప్పారు. అయినప్పటికీ శ్రేణులు వినలేదు. కావాలనే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం పేర్కొన్న ఉత్తర్వులను చూపించాలని టీడీపీ శ్రేణులు కోరాయి. పోలీసులకు మరింత కోపం వచ్చింది. ప్రశ్నించిన వారిపై కేసు పెడతాం అని బెదిరించారు.
సత్యవేడు నియోజకవర్గంలో గల తిమ్మ సముద్రం (timma samudram), రాగి కుంట (raagi kunta), కొత్తూరు (kottur), పివి కండ్రిగ (pivi kandriga) గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు (tdp workers) జెండాలు, బ్యానర్లను (banners) ఏర్పాటు చేశారు. నిబంధలనకు విరుద్దంగా ఉన్నాయని పోలీసులు (police) తొలగించారు. అక్కడ ఇరువురికి వాగ్వివాదం జరిగింది. ఓ గంట ఆగితే సరిపోయేది అని కార్యకర్తలు అన్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ఖాకీల తీరుపై కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇదీ మంచి పద్దతి కాదని సూచించారు.
నారా లోకేష్ పాదయాత్రని వెయ్యి మంది పోలీసులు (police) ఫాలో అవుతున్నారు. 30 వాహనాల్లో 20 మంది ఎస్సై లు, (20 si) 10 మంది సీఐలు, (10 ci) ఆరుగురు డీఎస్పీలు (6 dsp) వెంట ఉంటున్నారు. పాదయాత్ర గురించి ఎప్పటికప్పుడు పై అధికారులకు సమాచారం అందజేస్తున్నారు. లోకేశ్ ఎక్కడ మాట్లాడినా మైక్ లాకుంటున్నారు. జీఓ నంబర్ 1 (go no.1) అమల్లో ఉందంటూ మాట్లాడటానికి వీలు లేదని ఆంక్షలు విధిస్తున్నారు. చివరికీ లోకేశ్ (lokesh) నిలబడ్డ స్టూల్ కూడా లాక్కుంటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ యాత్ర చేసే సౌండ్ వెహికిల్స్ సీజ్ (seize) చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మైక్ కూడా వదలడం లేదు. దాంతో స్టూల్‌పై నిలబడి లోకేశ్ మాట్లాడుతున్నారు. దానిని కూడా వదలడం లేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
నారా లోకేశ్ (lokesh) పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో గల ఇచ్చాపురంలో ముగియనుంది. మొత్తం 400 రోజులపాటు ప్రజలతో మమేకం అవుతారు. 4 వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా పాదయాత్ర చేపడుతారు. నారా లోకేశ్ యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. సబ్బండ వర్గాలు లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటున్నారు.