Whatsapp Channels: వాట్సాప్ (Whatsapp) కొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది. ఇటీవల వచ్చిన ఫీచర్ వాట్సాప్ చానెల్స్ (Whatsapp Channels).. మనకు నచ్చిన నేత, సెలబ్రిటీ, సినీ తార చానెల్ ఓపెన్ చేసి.. ఫాలొ కావాల్సి ఉంటుంది. దీంతో వారి అప్ డేట్స్, ఫోటో, వీడియోలు కనిపిస్తుంటాయి. చాలా మందివి తీసుకోవడంతో స్టేటస్ పైకి వెళుతుంది. దీంతో స్టేటస్ చూడటం ఇబ్బందిగా మారుతోంది. దీంతో మళ్లీ తమకు స్టేటస్ కావాలని కొందరు అంటున్నారు. ఫీచర్ మాత్రం రావడం లేదు.
యూజర్ల ఇబ్బందులను వాట్సాప్ గమనించింది. వాట్సాప్ చానెల్ ఫీచర్ హైడ్ చేసుకోవాలని కోరింది. లేదంటే కనిపించకుండా మార్చుకోవాలని సూచించింది. ముందుగా వాట్సాప్ అప్ డేట్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలని కోరింది. కిందకు స్క్రోల్ చేస్తే చానెల్ కనిపిస్తాయి. అకౌంట్లో సరిపడ స్టేటస్ ఉంటే చానెల్స్ ఆటోమేటిక్‌గా కిందకి వెళతాయి. చానెల్స్ కనిపించకుండా చేసేందుకు మరో మార్గం కూడా ఉందట. వాట్సాప్‌లో ఫాలొ అవుతున్న చానెల్స్‌ను అన్ ఫాలొ చేస్తే చాన్సెల్స్ ఏవీ కనిపించవు.. స్టేటస్ మాత్రమే కనిపిస్తాయని అంటున్నారు.
చాట్స్ బ్యాకప్ చేసుకొని, కొత్త వెర్షన్ స్థానంలో వాట్సాప్ పాత వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకున్న చానెల్స్ గొడవ ఉందని అంటున్నారు. సో.. ఇలా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చానెల్స్ వల్ల యూజ్ ఉన్నప్పటికీ.. కొందరు స్టేటస్ చూడటంలో ఇబ్బంది పడుతున్నారు.