బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే… ఆ షోలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో… తాజాగా… వైసీపీ నేత , ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.
‘ఆరోజు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించారు. దీనిపై పెద్దాయనతో బాలయ్య, హరికృష్ణ, నాతో సహా మొత్తం ఐదుగురం భేటీ అయ్యాం. ఓ రూమ్లో నేను, ఎన్టీఆర్ 3 గంటలు చర్చించాం. ఆయన కాళ్లు పట్టుకుని మరి అడిగా.. చర్చిద్దామని చెప్పా కానీ, ఆయన వినకుండా నన్ను ఒప్పించారు. మేము ఆరోజు చేసింది తప్పా’ అని చంద్రబాబు ప్రశ్నించగా.. లేదు మీరు చేసింది కరెక్ట్ అని బాలయ్య చెప్పారు.
కాగా… దీనిపై అంబటి కౌంటర్ వేశారు. ‘ అప్పుడు కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు తన మాట వినమని! , వినలా ! గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.