Sharmila as PCC Chief: షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అప్పజెప్పారు. షర్మిలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా ఏఐసీసీ నియమించింది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు పద్మరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అప్పజెప్పారు. షర్మిలను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా ఏఐసీసీ నియమించింది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు పద్మరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.
గత కొంత కాలంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. దివంగత రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులుగా ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులు షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు పూర్తిగా సహకరించారు. గత కొన్ని నెలలుగా పలుసార్లు చర్చలు జరిపారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా సహకరించారు. కాంగ్రెస్ పెద్దల నుంచి పూర్తి భరోసా లభించడంతో షర్మిల తన రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. షర్మిల సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఎట్టకేలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది.
ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టనున్న షర్మిల…సోదరుడు జగన్ను నేరుగా ఎదుర్కోనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోనూ, లోక్సభ ఎన్నికల లోను కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగే వారి గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. సోదరుడు జగన్కు రాజకీయ ప్రత్యర్ధిగా మారిపోనున్నారు.