EG: చాగల్లు గ్రామానికి చెందిన వస్త్రాల మానస అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే.నరేంద్ర తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె రెండు రోజుల క్రితం తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదన్నారు. భర్త దేవదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈమె ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 9440796662 కాల్ చేయాలన్నారు.