ATP: తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ రహార్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. అధికారులతో కలిసి గ్రామస్థుల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.