W.G: పాలకొల్లులో శుక్రవారం పలు గ్యాస్ ఏజెన్సీలు, గోడౌన్లను పౌర సరఫరా అధికారులు తనిఖీలు చేశారు. జేసీ ఆదేశాలతో ప్రతిరోజూ గ్యాస్ నిల్వలు, విక్రయాలు, బుకింగ్‌లో ఇబ్బందులు తదితర వాటిపై తనిఖీలు చేస్తున్నామని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని సీఎస్జీటీ కేపీఎన్. దేవి పేర్కొన్నారు. పలువురు వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.