CTR: పుంగనూరులో ఈ నెల 31 తేదీ రాత్రి పోలీసుల ఆంక్షలను ప్రజలు పాటించాలని అర్బన్ CI సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. పబ్లిక్ స్థలాలలో వేడుకలు అనుమతించబడవని, టపాసులు కాల్చడం నిషేధమని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిప రాదని, స్పీడ్‌గా బైక్స్ నడపడం వంటివి చేయరాదన్నారు. పట్టణంలో పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు.