TPT: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మినాయుడుపాలెం బృందావన్ గార్డెన్ సమీపంలో విద్యుత్ షాక్కు గురై భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. మృతుడు లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న చంద్రమౌళిగా పోలీసులు గుర్తించారు. హరిబాబు అనే బిల్డర్ వద్ద భవన పునాదులకు డ్రిల్లింగ్ వేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.