GNTR: తెనాలికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సభ్యులు మానవత్వం చాటుకున్నారు. వేర్వేరు రైలు ప్రమాదాల్లో మృతి చెందిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు, జంగారెడ్డిగూడెం వాసి అంత్యక్రియలను వారే నిర్వహించారు. కుటుంబ సభ్యులు మృతదేహాలను స్వగ్రామాలకు తరలించలేమని చెప్పడంతో, పోలీసుల సమక్షంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.