TPT: తిరుపతి ప్రెస్ క్లబ్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రెస్ మీట్ నిర్వహించి, నిన్న YCP నేత కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తిరుచానూరు సమీప ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలన్న ఆరోపణలు పూర్తిగా దుష్ప్రచారమని ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కోసం నియమ నిబంధనల ప్రకారమే భూముల కేటాయింపు జరుగుతుందన్నారు.