E.G: నిడదవోలు మున్సిపల్ ప్రత్యేక అధికారి, APMIP ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.దుర్గేశ్ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందే సేవలు వేగవంతంగా, పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో కమిషనర్ టి.కృష్ణవేణి పాల్గొన్నారు.