PLD: మాచర్ల పట్టణంలోని SKBR కళాశాల గ్రౌండ్ నందు సంక్రాంతి సంబరాల్లో భాగంగా భవనాసి పద్మావతి జ్ఞాపకార్థంతో నిర్వహిస్తున్న ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. క్రీడల ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.