కృష్ణా: సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని PACS కార్యదర్శుల సంఘ నేత చండ్ర రవి డిమాండ్ చేశారు. మంగళవారం చల్లపల్లిలోని కేడీసీసీ బ్యాంకు వద్ద సహకార సంఘాల ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవోలు కృష్ణారావు, శ్రీనివాసరావు, చక్రపాణి, నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.