SS: హిందూపురంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ రమేష్ కుమార్ అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునతో కలిసి ఆయన ఛాంబర్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవతో మంజూరైన రూ.92.50 కోట్ల నిధులతో జరుగుతున్న పనుల్లోఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.