SKLM: జీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని సత్య సాయి క్యాష్యూ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి యన్ గణపతి, ఉపాధ్యక్షులు కె.కేశవరావు, జీడి సంఘం నాయకులు జి.బాలమ్మలు డిమాండ్ చేశారు. శనివారం మందస మండలంలో కార్మికులతో నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టారు.