ASR: మ్యూటేషన్ల పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరమైన సేవలు అందించి, పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్ నుండి అధికారులతో వీసీ నిర్వహించారు. మ్యూటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలన్నారు.