GNTR: యూజీసీ నెట్ పరీక్షలను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కోరుతూ విద్యార్థులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పరీక్ష కేవలం ఇంగ్లీష్, హిందీలోనే ఉండటం వల్ల గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.