VSP: విశాఖపట్నం జిల్లా కోర్టు సముదాయంకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కోర్టు ఆవరణను తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు డిటెక్షన్, డాగ్ స్క్వాడ్లతో గాలింపు చేపట్టారు. ముందు జాగ్రత్తగా న్యాయమూర్తులు, సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపించి తనిఖీలు నిర్వహించారు.