KRNL: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా డిప్యూటీ కలెక్టర్ పీ. సింధు సుబ్రహ్మణ్యం శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి నిరంతరం ప్రణాళికలు చేస్తానని అన్నారు. అనంతరం ఆసుపత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్, డా. సీతారామయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు.