KDP: పులివెందులలోని స్థానిక రమణప్పసత్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ వ్యక్తిగత, సమాజ పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుందని, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.