KRNL: ఆదోనిలో రూట్లకు విరుద్ధంగా నడుస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శీషిరా దీప్తి గురువారం తనిఖీ చేశారు. వాహనానికి సంబంధిత రూట్ మ్యాప్ అనుమతి పత్రాలు ఇతర రికార్డులు పరిశీలించి నిబంధనలు ఉల్లంఘనను గుర్తించారు. ప్రయాణికుల భద్రత పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.