SKLM: ఉగాది వేడుకలను సంప్రదాయభద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర రావు కోరారు. ఈ వేడుకల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనలతో ఉగాది జరుగును.