ELR: కలిదిండి ప్రధాన కూడలిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహానికి పేడ పూసిన ఇద్దరు వ్యక్తులను కలిదిండి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కైకలూరు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవికుమార్ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కట్టా ఈశ్వర కుమార్, జి.అయ్యప్పలను అరెస్టు చేసినట్లు తెలిపారు.