విశాఖ నగరాభివృద్ధి ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమవుతుందని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో జోన్ల సంఖ్యను 8 నుంచి 10కి పెంచినట్లు వెల్లడించారు. అనంతరం న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు.