E.G: చాగల్లు(M) చిక్కాల గ్రామంలో బుధవారం ‘రీసర్వే 2.0’ ప్రక్రియ ప్రారంభమైంది. తహసీల్దార్ ఎం.మేరకమ్మ అధ్యక్షతన, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులకు సర్వే విధానంపై అవగాహన కల్పించారు. శాటిలైట్ సాయంతో టెక్నికల్ టీం ద్వారా నాన్-సిగ్నల్ ఏరియా భూములను శాస్త్రీయంగా సర్వే చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు.