BPT: చీరాల మండలం ఈపురుపాలెంలో నిర్మించనున్న నూతన బస్సు షెల్టర్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ స్థలాలను నాయకులు, అధికారులతో కలిసి MLA కొండయ్య శనివారం పరిశీలించి సర్వే నిర్వహించారు. నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ నూతన భవనాలు అందుబాటులోకి వస్తే గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయన్నారు.