NLR: గూడూరు తిలక్ నగర్లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో పలు సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. రూ. 3.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అధికారులు తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.