అనంతపురం కలెక్టరేట్, రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. డీఆర్వో మలోల, ఇతర శాఖల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, పౌర సేవలకు సంబంధించిన వినతులు అందుతున్నట్లు అధికారులు తెలిపారు.