సత్యసాయి: పుట్టపర్తి అభివృద్ధికి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో పలు అభివృద్ధి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. చిత్రావతి నది తీరంలో సత్యసాయి విగ్రహం ఏర్పాటు చేయాలని, రహదారులు, సర్కిళ్లను అందంగా ముస్తాబు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన వీధుల్లో సాయి నామ సంకీర్తన వినిపించేలా మైకులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.