అన్నమయ్య: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు,రాబోయే రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిట్వేలు పంచాయతీ సర్పంచ్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, గుంజన నది పరిసరాలు, తోపు వీధి, బ్రాహ్మణ వీధి, పాత చిట్వేల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.