తిరుపతి: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో 27, 28, 29వ(శని, ఆది, సోమవారం) తేదీలకు శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. తిరుమల, రేణిగుంట విమానాశ్రయంలోని కౌంటర్లలో ఈ మూడు రోజులు టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి తమ దర్శన ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.