NLR: పీ-4 విధానంలో భాగంగా దాతల సహకారంతో బుచ్చిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణం నాసిరకంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు కారుతున్నాయి. కొన్నిచోట్ల పెచ్చులు ఊడుతున్నాయి. పాత దుకాణాల గోడలకు ఉన్న రంధ్రాలను పూడ్చకుండా తూతూ మంత్రంగా నిర్మాణాలు చేసి రంగులు వేశారని పలువురు వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.