కోనసీమ: ఆలమూరు మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలి అనే నినాదంతో ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుమారుగా వందమంది ఆలమూరు మండలం నుంచి వివిధ పార్టీల నాయకులు, సంఘ నాయకులు, ప్రజలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జేఏసీ సభ్యులు ఆలమూరు మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాల్సిన ఆవశ్యకతను వివరించారు.