కోనసీమ: రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి పోలిశెట్టి భార్గవ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల హెచ్ఎం విప్పర్తి శాంతి సునీత శుక్రవారం తెలిపారు. అనపర్తిలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో భార్గవ్ ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. నవంబర్ 1న తూర్పుగోదావరి జిల్లాలో జరిగే పోటీలలో భార్గవ్ పాల్గొననున్నాడు.