ప్రకాశం: మార్కాపురం పట్టణంలో శుక్రవారం డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు మార్కాపురం సీఐ సుబ్బారావు మీడియాకు తెలిపారు.