NDL: అవుకు మండలం సుంకేసుల గ్రామంలో మంగళవారం ప్రైవేట్ స్కూల్ బస్సు బాలుడిని ఢీకొనడంతో మహీధర్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తన అక్క పాఠశాలకు బస్సులో వెళుతుండగా అక్కను చూసేందుకు వచ్చి మహిధర్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతి తల్లిదండ్రులు బోరుమని విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.