పల్నాడు: సత్తెనపల్లి మెప్మా కార్యాలయంలో శనివారం ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వి. విజయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది దివ్వెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. మహిళలకు కల్పించిన ఆస్తి హక్కు, మనోవర్తి, వరకట్న వేధింపుల నిరోధక చట్టాలపై ఆయన సమగ్రంగా వివరించారు.