కృష్ణా: గుడ్లవల్లేరు మండల ఏవో సునీల్ కౌతవరం గ్రామం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. మండలంలో మొత్తం 9,000 హెక్టార్లలో వరి సాగు జరుగుతుండగా, ప్రాథమిక అంచనా ప్రకారం 1,502 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. గురువారం నాటికి గ్రామ వ్యవసాయ సహాయకులు యాప్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.