GNTR: మంగళగిరి పరిధి యర్రబాలెంలో మంత్రి నారా లోకేశ్ చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నాయకులు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. బిట్ర వనజ రూ. 36,569, బెల్లంకొండ ఆంజనేయులు రూ. 51,551 విలువైన చెక్కులను వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. చెక్కులను అందజేసిన వారిలో టీడీపీ నాయకులు ఆకుల ఉమా మహేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు నీలం అంకారావు పాల్గొన్నారు.