కృష్ణా: శాసన సభ, శాసనమండలి చీఫ్ విఫ్, విప్‌లను కాసేపటి క్రితం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇద్దరు చీఫ్ విప్‌లతోపాటు 15 మందిని విప్‌లుగా నియమించింది. శాసన సభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ(విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య(నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం) నియమితులయ్యారు.