VZM: పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారంలో 4వ సోమవారం సందర్భంగా 700 ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభూ శివాలయంలో “లక్ష దీపారాధన మహోత్సవం” ఘనంగా నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ కోట్ల రఘు పేర్కొన్నారు. ఉదయం 1000 బిందెలతో జలాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన, భజన కార్యక్రమాలు జరిపినట్లు తెలిపారు. భక్తులు ఈ లక్ష దీపారాధన మహోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించారన్నారు.