GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే PGRS కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు రాయించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు ప్రజలకు సులభతరం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించడం జరిగిందని శనివారం పేర్కొన్నారు. ఈ సదుపాయం అక్టోబర్ 13 నుంచి ప్రారంభమవుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.